పులివెందుల ‘పులి’ కంచుకోట బద్దలు..!
05:58 pm Oct 27, 2026

..మున్సిపాల్టీలో 20 వార్డుల ఏకగ్రీవాలతో జగన్‌కు షాక్

..జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమికి ఏకగ్రీవాలు

..కూటమి దూకుడుని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ బాస్

..పోలీసులపై అక్కసు వెళ్లగక్కుతున్న పులివెందుల ఎమ్మెల్యే

..జగన్‌కి ఇజ్జత్‌గా సవాల్‌ అయిన చైర్‌పర్సన్ గెలుపు

..వ్యూహాత్మకంగా వైసీపీ కంచుకోటను బద్దలు కొడుతున్న బీటెక్ రవి

మహానాడు, కడప:

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ సీఎం జగన్ సొంత నియోజకర్గంలో వైసీపీకి కోలుకోలేని చావు దెబ్బ తగిలింది. పులివెందుల మున్సిపాల్టీలో సగం వార్డులు కూటమి పార్టీలకు ఏకగ్రీవం అవ్వడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం 40 వార్డుల్లో 20 కూటమి పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి.  మిగిలిన 20 వార్డులతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి నవంబరు 1న ఎన్నికలు జరుగుతాయి. 

సొంత సెగ్మెంట్లో ఏకగ్రీవాలపై జగన్ అసహనం 

2021 స్థానిక సమరంలో పులివెందులలో జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి సొంత సెగ్మెంట్లో ప్రస్తుతం కూటమికి 20 వార్డులు ఏకగ్రీవం అవ్వడంపై జగన్ తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. 
ఆ క్రమంలో పులివెందులలో 2 రోజుల పర్యటనకు వచ్చిన జగన్..  పోలీసులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తన వాళ్ల పై చేయి వేస్తే తనపై వేసినట్లేనని గుర్తించుకోవాలని పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలే నెంబర్-2 అని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పిన్ని గెలుపు జగన్‌కి సవాలే 

పులివెందుల చైర్ పర్సన్ అభ్యర్థిగా జగన్ బాబాయి  భార్య  వైఎస్ లలితమ్మ పోటీ చేస్తున్నారు.  ఆమెను గెలుపు జగన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. 
అందుకే పోలింగ్ రోజు పులివెందుల వస్తానని, ఓటు వేస్తానంటున్నారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అని కలలుకంటూ, పోలింగ్ రోజు ఏకపక్షంగా పనిచేసే అధికారులపై చర్యలుంటాయని, రిటైర్ అయినా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నారు. 
మరోవైపు టీడీపీ అభ్యర్ధినిగా ఉన్న మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తూగుట్ల మధుసూదన్‌రెడ్డి సతీమణి  గీతాకుమారి విజయాన్ని పులివెందుల టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  మధుసూదన్ రెడ్డి స్వయంగా పులివెందుల మున్సిపాలిటీలోని 33వ వార్డు నుండి టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

పులివెందులలో జగన్‌కు చుక్కలు చూపిస్తున్న బీటెక్ రవి 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బీటెక్ రవి.. అక్కడ జగన్ మెజార్టీకి గణనీయంగా గండి కొట్టారు. పులివెందుల జడ్పీటీసీ బైపోల్స్‌లో బీటెక్ రవి తన సతీమణిని గెలిపించుకుని జగన్‌కు సవాల్ విసిరారు. ఆ క్రమంలో పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి జగన్‌ను ఇప్పటికే వరుస షాక్‌లిచ్చారు.
మున్సిపాల్టీలో సగం వార్డుల్లో వైసీపీని అడ్రస్ లేకుండా చేశారు.  పులివెందుల నియోజకవర్గంలోని 65 ఏంపీటీసీ స్థానాలకు గాను 64 చోట్ల ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. 7 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 3 చోట్లు ఎన్నికల ముందే గెలిచింది. 
ఈ పరిణామాల మధ్య పులివెందుల చైర్ పర్సన్‌గా తన పిన్నిని గెలిపించుకోవడం జగన్‌కు ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది