సినిమా నటుడిగా మారిన ఆ ‘టీడీపీ ఎమ్మెల్యే’..!? ఎవరో తెలుసా?
07:10 pm Aug 24, 2026

..సినిమా రంగంలోకి చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్..!
..ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే.. నటుడిగా కొత్త అవతారం.
..‘ది బ్రెయిన్‌’ సినిమాలో హోంమంత్రి పాత్రలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్.
..రాజకీయాల్లోనే కాదు.. సినిమాలోనూ తనదైన ముద్ర వేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం.

మహానాడు, అమరావతి: రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ఇప్పుడు సినిమా రంగంలోనూ అడుగుపెడుతున్నారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. నటుడిగా కొత్త అవతారం ఎత్తనున్నారు.

గురజాల జగన్‌మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘ది బ్రెయిన్‌’ సినిమా ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో ఆయన హోంమంత్రి పాత్రలో కనిపించనున్నారు.

తెరపై హోంమంత్రిగా..

రాజకీయాల్లో అనుభవం ఉన్న గురజాల జగన్‌మోహన్.. సినిమాలోనూ రాజకీయ నేపథ్యానికి సంబంధించిన పాత్రనే ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

హోంమంత్రి పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారు? పాత్రను ఏ విధంగా పోషించారన్నది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

రాజకీయాల తర్వాత సినిమా..

ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూనే.. సినిమాల్లో నటించేందుకు జగన్మోహన్‌ ఆసక్తి చూపుతున్నారు.

రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఇప్పుడు వెండితెరపై కూడా తన నటనతో గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కనిపించే గురజాల జగన్మోహన్‌.. త్వరలో వెండితెరపై హోంమంత్రిగా ఎలా కనిపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.