ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు శ్రీశైలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
..ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు 'శ్రీశైలం దేవస్థానం' తరఫున పట్టువస్త్రాల సమర్పణ
..శ్రీశైలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్, EO మరియు పాలకమండలి సభ్యులు
విజయవాడ, మహానాడు ; విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు, ఆలా అనిల్ కుమార్, శంకరశెట్టి పిచ్చయ్య ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని రాష్ట్రంలో సుభిక్షం, శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించారు.