LATEST UPDATES

Continuous coverage of the latest breaking news

04:42 PM (IST) 15 Sep, 2026
అమరావతి : పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఏపీ ఎన్నికల సంఘం అడుగులు..!

12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈసీ కసరత్తు పూర్తి.

2 ప్రత్యేక నోటిఫికేషన్లను విడుదల చేసిన SEC అనిల్‌చంద్ర పునేఠా.

వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాలని SEC ఆదేశం.

2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణించి ఓటర్ల జాబితా రూపకల్పన.

Share:
04:35 PM (IST) 15 Sep, 2026
అమరావతి : నిరుద్యోగుల అవకాశాలపై 'సాక్షి' విషం చిమ్ముతోంది..!

ఐదేళ్లు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టూ భర్తీ చేయని వైసీపీకి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ పుట్టిందా?

160 ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక తప్పుడు కథనాలతో అడ్డుకునే కుట్ర.

అభ్యర్థులు కోరిన విధానాన్నే అమలుచేస్తే అక్రమమా?

కనీసం డైరెక్టర్ ఎవరో తెలుసుకోకుండా కథనం రాస్తారా? ఇదేనా ‘సాక్షి’ జర్నలిజం?

ఉద్యోగాలు ఇవ్వడం మా విధానం.. ఉద్యోగాలకు అడ్డుపడటం వైసీపీ విధానం.

: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Share:
04:32 PM (IST) 15 Sep, 2026
తిరుమలకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.

రాత్రి 07.40 గంటలకు బేడి ఆంజనేయస్వామి దర్శనం అనంతరం వేంకటేశ్వరస్వామికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేత.

ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులు.

Share:
04:24 PM (IST) 15 Sep, 2026
పోలవరం జిల్లా : విహార యాత్రలో విషాద ఘటన..!

'సోకిలేరు వ్యూ పాయింట్' వద్ద వాగులో స్నానానికి దిగిన హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.

వాగులో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహం.

వాగు ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయిన ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.

ఐదుగురిని రక్షించిన స్థానికులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 'నీలేష్' ఆచూకీ గల్లంతు.

నీలేష్ కోసం కొనసాగుతున్న గాలింపు.

Share:
04:14 PM (IST) 15 Sep, 2026
హైదరాబాద్ : సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు..!

నానక్‌రామ్‌గూడ భూవివాదంలో చంద్రశేఖర్‌రెడ్డిపై ఫిర్యాదు.

కాస్మోస్ భవన ప్రాంగణంలో సెక్యూరిటీని బెదిరించారని ఆరోపణ.

గేటు తాళాలు పగులగొట్టి, నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదు.

Share:
Share Updates