రాష్ట్ర రాజకీయాల్లో మేడం ‘రూటే సెపరేట్‌’..! ఓ ‘TDP ఎమ్మెల్యే’ ఇలా ఉంటే ఎలా..?
01:06 am Sep 15, 2026

..పాత రాజకీయ లెక్కలకు భిన్నంగా.. తక్కువ సమయంలోనే రాష్ట్రస్థాయి గుర్తింపు!

..ఎప్పుడూ వినూత్న అడుగులు..మహిళా నాయకత్వానికి కొత్త నిర్వచనం..

..ఆ నియోజకవర్గంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ సూపర్ సక్సెస్‌.. కార్యకర్తలకు ఎమ్మెల్యే  ‘రిటర్న్‌ గిఫ్ట్‌’!

..హంగూ లేదు.. ఆర్భాటం లేదు..సింపుల్ గా స్కూటర్‌పై తిరిగే ఎమ్మెల్యే

..‘ఆఫ్‌ ద కార్యకర్త ‌.. బై ద కార్యకర్త‌.. ఫర్‌ ద కార్యకర్త‌’.. ఇదే మేడం స్టైల్‌!

..ఉమ్మడి గుంటూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మేడం ప్రస్థానం!

..మేడం ఎదుగుదల చూసి.. కొందరు ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకుల గుండెల్లో గుబులు?!

..రాబోయే రోజుల్లో మేడమ్‌గారి నుంచి ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయో.. వేచి చూడాల్సిందే..!

మహానాడు, గుంటూరు: రాజకీయాలు అనగానే.. సీనియర్లు, వారసత్వాలు, వర్గాలు, ఫేమస్‌ ముఖాలు.. ముఖ్యంగా పురుషాధిక్యత. తరాలు మారాయి.. Gen Z కూడా వచ్చింది.. కానీ రాజకీయాల్లో ఈ పాత లెక్కలు మాత్రం పెద్దగా మారలేదు. అయితే.. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఈ లెక్కలకు ఓ మహిళా నాయకురాలు కొత్త సమాధానం చెబుతున్నారు.

2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా పేరు ప్రకటించినప్పుడు.. కొత్త ముఖానికి అవకాశం ఇవ్వడంపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ.. ఎన్నికల ప్రచారంలోనే ఆమె తనదైన శైలి ఏంటో చూపించారు. ప్రజల్లోకి వేగంగా వెళ్లి.. ప్రత్యర్థి మాజీ మంత్రి విడదల రజనీపై విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడితో ఆగలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు.. ప్రజలతో మమేకం.. కార్యకర్తలతో అనుబంధం.. పార్టీలో కీలక బాధ్యతలు.. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు ‘గల్లా మాధవి’.

గల్లా మాధవి ‘రూటే సెపరేట్’‌.. ఎప్పుడూ వినూత్న అడుగులు

ట్రాన్స్‌జెండర్‌ వర్షిణిని వ్యక్తిగత సహాయకురాలిగా నియమించుకోవడం.. మరోవైపు గల్లీలో గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు అందితే.. పోలీసుల కోసం ఎదురుచూడకుండా స్కూటీపై అక్కడికి చేరుకుని స్వయంగా రంగంలోకి దిగడం.. రేషన్‌ మాఫియాపై పోరాటం.. ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్‌ నిర్వహించడం.. మహిళల జోలికి వస్తే.. సొంత కార్యకర్త అయినా క్షమించని నైజం.. ఇలా ఒక్కో అంశంలో తనదైన ముద్ర వేస్తున్నారు గల్లా మాధవి.

అంతేకాదు.. నియోజకవర్గంలోని పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను తన పిల్లలుగా భావించి.. విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లి, ఉపరాష్ట్రపతితో భేటీ చేయించడం ద్వారా విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.

ఇక సీనియర్లు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు వెనుకాడిన చోట.. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం ముట్టడించడంతో అప్పట్లో గల్లా మాధవి పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇలా ప్రజా సమస్యలపై ఫీల్డ్‌లోకి వెళ్లడం నుంచి.. సామాజిక, విద్యా కార్యక్రమాల వరకు భిన్నమైన నిర్ణయాలతో గల్లా మాధవి రాజకీయ శైలి ప్రత్యేకంగా నిలుస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది

‘ఇంటింటికీ తెలుగుదేశం’ సూపర్ సక్సెస్‌.. కార్యకర్తలకు ‘రిటర్న్‌ గిఫ్ట్‌’!

గుంటూరు పశ్చిమలో టీడీపీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేయడంలో కార్యకర్తలు కీలకంగా పనిచేశారు.

కార్యకర్తల కష్టాన్ని గుర్తించిన గల్లా మాధవి.. సాధారణంగా సభలు, సమావేశాలతో సరిపెట్టకుండా వారికి ఓ ప్రత్యేక అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించారు.

సుమారు 450 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను తమ సొంత ఖర్చుతో వెలుగొండ–శ్రీశైలం పర్యటనకు తీసుకెళ్లారు. అభివృద్ధి ప్రాజెక్టును ప్రత్యక్షంగా చూపించి.. అనంతరం ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వామివారి దర్శనం చేయించడం ఈ పర్యటన ప్రత్యేకతగా నిలిచింది.

హంగూ లేదు.. ఆర్భాటం లేదు.. స్కూటర్‌పై తిరిగే ఎమ్మెల్యే..!

గల్లా మాధవి వ్యవహారశైలిలో ఎక్కడా హంగామా కనిపించలేదు... ఎమ్మెల్యే అయినా కార్యకర్తల మధ్య సాధారణ వ్యక్తిలా కలిసిపోవడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

అంతేకాదు.. కాన్వాయ్‌లు, హంగామాకు దూరంగా అవసరమైన సందర్భాల్లో స్కూటర్‌పై నియోజకవర్గంలో పర్యటిస్తూ.. సమస్య ఉన్న చోటకు స్వయంగా చేరుకోవడం ఆమె శైలికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.

‘ఆఫ్‌ ద కార్యకర్త ‌.. బై ద కార్యకర్త‌.. ఫర్‌ ద కార్యకర్త‌’.. ఇదే గల్లా మాధవి స్టైల్‌!

కార్యకర్తలతో కలిసి నడవడం.. వారి సమస్యలు తెలుసుకోవడం.. వారిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం.. కష్టపడ్డ కేడర్‌ను గుర్తించి ప్రోత్సహించడం.. ఇలా కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు గల్లా మాధవి.

పదవి తనకు వచ్చినా.. తన బలం కార్యకర్తలేననే భావనతో ముందుకు సాగుతున్నారన్నది టీడీపీ శ్రేణుల మాట.

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ నాయకుల గుండెల్లో ఎందుకీ గుబులు?!

ఒకప్పుడు “కొత్త ముఖం.. ఎలా నెట్టుకొస్తారు?” అన్నవాళ్లే.. ఇప్పుడు గల్లా మాధవి రాజకీయ వేగాన్ని గమనించాల్సిన పరిస్థితి.

ఎమ్మెల్యేగా గెలుపు.. క్షేత్రస్థాయిలో చురుకుదనం.. కార్యకర్తలతో పెరుగుతున్న ఆదరణ.. అధిష్ఠానం వద్ద పెరుగుతున్న ప్రాధాన్యత.. అనతి కాలంలోనే పొలిట్‌బ్యూరో మెంబర్‌గా.. ఇలా వరుస పరిణామాలతో ఉమ్మడి గుంటూరు రాజకీయాల్లో ఆమెపై ఫోకస్‌ పెరుగుతోంది. వాస్తవానికి కొంతమంది నేతలు లోలోపల జీర్ణించుకోలేకపోతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. గల్లా మాధవి మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

రాబోయే రోజుల్లో మేడమ్‌గారి నుంచి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్‌’లు ఉంటాయో?!

ఇప్పటివరకు గల్లా మాధవి చేసిన కార్యక్రమాలు.. ఆమె రాజకీయ శైలిని స్పష్టంగా చూపించాయి. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి.. ఇక రాబోయే రోజుల్లో మేడమ్‌గారు నుంచి ఇంకెన్ని వినూత్న ‘సర్‌ప్రైజ్‌’లు ఉంటాయో.. వేచి చూడాల్సిందే!

చివరిగా..

బీఫాం ఇచ్చిన అధిష్ఠానం వద్ద.. గెలిపించిన ప్రజల వద్ద.. వెంట నడిచే కార్యకర్తల వద్ద.. మంచి మార్కులు కొట్టేస్తున్నారన్న చర్చ సాగుతోంది.

కొత్త ముఖం కూడా తన పనితీరుతో రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవచ్చని మాధవి ప్రస్థానం చాటుతోంది.

ప్రజల కోసం మరింత పనిచేస్తూ.. కార్యకర్తలకు  అండగా నిలుస్తూ.. యువ నాయకత్వానికి స్ఫూర్తిగా మారుతూ ‘గల్లా మాధవి’ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ‘మహానాడు మీడియా’ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది.. ఆల్‌ ది బెస్ట్‌!