‘జగన్’ లెక్కలో.. మేఘాలు కూడా ‘బాబు’కే భయపడుతున్నాయా?
..అసెంబ్లీలో అడుగు పెట్టరు.. బయట మాత్రం ప్రభుత్వంపై విషపు వర్షం!
..ఎల్‌నినో ప్రభావం కూడా బాబు ఖాతాలోకేనా?
..వాన రాకపోయినా బాబే.. కరువు వచ్చినా బాబేనా?
..ఇంకా నయం.. నేపాల్ వరదలకూ బాబే కారణమని అనలేదు!
మహానాడు, అమరావతి: రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా.. దానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమన్నట్టుగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. వర్షాలు తగ్గినా ప్రభుత్వానిదే తప్పంటూ మాట్లాడటంపై ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ‘చివరికి ఆకాశం వైపు చూసినా జగన్‌కు కనిపించేది చంద్రబాబేనా?’ అంటూ నవ్వుకుంటున్నారు.
అసెంబ్లీకి దూరం..బయట మాత్రం విషపు వర్షం!
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన వేదిక అసెంబ్లీ. వర్షపాతం, కరువు, సాగునీటి సమస్యలపై సభలో చర్చకు అవకాశం ఉన్నా.. జగన్ అక్కడ కనిపించకుండా ప్యాలెస్‌లో కూర్చొని మీడియా ముందు విమర్శలు చేయడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
వర్షాలకూ బాబే కారణమా?
వర్షపాతం అనేది ప్రభుత్వ ఆదేశాలతో పెరిగేది, తగ్గేది కాదని.. రుతుపవనాలు, ఎల్‌నినో వంటి అనేక సహజ పరిస్థితులు ప్రభావితం చేస్తాయని అధికార పక్షం చెబుతోంది. అయినా వర్షాలు తగ్గితే ప్రభుత్వాన్ని తప్పుబట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
డీఎస్సీ నుంచి కరువు వరకు.. టార్గెట్ చంద్రబాబు!
డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, రైతుల సమస్యలు, వర్షపాతం.. ఏ అంశం వచ్చినా జగన్ విమర్శల బాణం చంద్రబాబు ప్రభుత్వంపైనే ఉంటోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పనులు, నియామకాలను ప్రశ్నించడం కంటే.. ప్రతి అంశాన్నీ రాజకీయ విమర్శగా మార్చడమే లక్ష్యంగా మారిందని అనుకుంటున్నారు.
విమర్శలతో వైసీపీకే నష్టమా?
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న విమర్శలు చివరకు వైసీపీకే ప్రతికూలంగా మారుతున్నాయా?
మొత్తానికి.. వాన పడినా బాబే.. వాన పడకపోయినా బాబే.. కరువు వచ్చినా బాబే! అన్నట్టుగా సాగుతున్న ఈ రాజకీయ విమర్శలు వైసీపీకి ఎంతవరకు మైలేజ్ ఇస్తాయో.. చివరకు ‘బాబు జపం’గానే మిగులుతాయో చూడాలి.