చంద్రబాబు విజన్‌కు జలసాక్ష్యం ‘వెలిగొండ’
..30 ఏళ్ల క్రితమే భవిష్యత్తు చూసిన చంద్రబాబు
..కరువు ప్రాంతాలకు జల‘వెలుగు’
..1996 మార్చి 5న వెలిగొండకు శంకుస్థాపన..2019 నాటికి పనుల్లో గణనీయ పురోగతి..
..‘వైసీపీ’ హయాంలో గ్రహణం
..పూర్తికాకుండానే జాతికి అంకితం చేసిన జగన్
..ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసిన ది గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు
మహానాడు, అమరావతి: కొన్ని ప్రాజెక్టులు ప్రభుత్వాలు మారితే మారిపోతాయి.. లేదా ఆగిపోతాయి. మరికొన్ని ప్రాజెక్టులు నాయకుడి విజన్‌కు కాలపరీక్షగా నిలుస్తాయి. వెలిగొండ రెండో కోవకు చెందుతుంది. 1996లో కరువు ప్రాంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వేసిన పునాదులు.. మూడు దశాబ్దాల తర్వాత కృష్ణా జలాల రూపంలో సాకారం కాబోతున్నాయి. ఆగస్టు 31న తొలి దశ ప్రారంభానికి సిద్ధమవుతున్న వెలిగొండ.. చంద్రబాబు దీర్ఘకాలిక ఆలోచనకు జలసాక్ష్యంగా నిలవబోతోంది.
30 ఏళ్ల క్రితమే భవిష్యత్తు చూసిన చంద్రబాబు నాయుడు
పశ్చిమ ప్రకాశం అంటే కరువు, వలసలు, భూగర్భజలాల కొరత, ఫ్లోరైడ్ సమస్యలకు చిరునామా. వర్షం వస్తేనే పంట.. లేకపోతే రైతుకు అప్పు. సాగునీటి భరోసా లేక యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి.
ఇలాంటి ప్రాంతానికి శాశ్వత నీటి పరిష్కారం అవసరమని భావించిన చంద్రబాబు 1996 మార్చి 5న వెలిగొండకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో అందరికీ అది కేవలం మరో సాగునీటి ప్రాజెక్టుగా కనిపించింది. కానీ నేడు వెనక్కి తిరిగి చూస్తే.. అది కరువు ప్రాంత ఆర్థిక భవిష్యత్తును మార్చే దీర్ఘకాలిక విజన్ అని నిపుణులు కూడా ప్రశంసిస్తున్నారు.
అధికారం చేపట్టిన ప్రతిసారీ పరుగులు..
2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండను ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకుంది. సొరంగాల తవ్వకానికి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ పనులను వేగవంతం చేసింది. 2019 నాటికి టన్నెల్-1లో 16.16 కిలోమీటర్లు, టన్నెల్-2లో 10.70 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
వైసీపీ హయాంలో గ్రహణం..
అయితే 2019 తర్వాత పనులు ఆశించిన వేగంతో సాగలేదు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైసీపీ సర్కారు ఐదుసార్లు ముహూర్తాలు ప్రకటించినా.. ప్రాజెక్టు పూర్తికాలేదు. టీడీపీ హయాంలో మొత్తం రూ.1,414 కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ వచ్చాక రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించి, 5 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి.
నిర్వాసితులకు ప్యాకేజీ, పునరావాసంతో పాటు.. కాలువలు, వంతెనల నిర్మాణం, కొల్లంవాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు.. ఇవన్నీ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రాజెక్టు పూర్తి చేశామన్న క్రెడిట్ కోసం శిలాఫలకాలపై పేర్లు వేయించుకుని.. వెలిగొండ ప్రాజెక్టు ట్విన్ టన్నెళ్లను 2024 మార్చి 6న ప్రారంభించి, జాతికి అంకితం చేసినట్లు ప్రకటించారు. వాస్తవానికి అప్పటికి ఒక్క టన్నెల్ పనులు కూడా పూర్తవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.
మాట ప్రకారం పూర్తి చేసిన ది గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు
ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో రూ.4,000 కోట్లు ఇంకా ఖర్చు చేయాల్సి ఉన్నా.. జగన్ ఉత్తుత్తి ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోయారని టీడీపీ నేతలు విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వెలిగొండ పనుల వేగం పెరిగింది. 2026 ఖరీఫ్ నాటికి తొలి దశను పూర్తి చేస్తామని చంద్రబాబు ముందే ప్రకటించారు. మాటకే పరిమితం కాకుండా పనులను విభజించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు.
సొరంగాల్లో మిగిలిన పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, లైనింగ్, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వంటి అనేక అంశాలను సమాంతరంగా పూర్తి చేయించారు. మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించారు.
ఈ ఆగస్టు 31న ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం కాబోతుండటంతో.. చంద్రబాబు విజన్‌కు వెలిగొండ అద్దం పడుతోంది.