పవన్‌ కల్యాణ్‌ ‘ గవర్నర్ ఎట్ హోమ్‌’కు ఎందుకు వెళ్లడం లేదు? అసలు కారణం ఇదే!
04:01 pm Aug 15, 2026

..ఉప ముఖ్యమంత్రి ‘పవన్ కళ్యాణ్’కు తీవ్ర జ్వరం..!
..కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్.
..రాజమహేంద్రవరంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించిన పవన్ కల్యాణ్.
..జ్వరం తీవ్రం కావడంతో రాజమహేంద్రవరంలో వైద్యుల పరీక్షలు.

..కొంత ఉపశమనం అనంతరం, హైదరాబాద్‌కు బయలుదేరనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
..లోక్‌భవన్‌లో ఈ సాయంత్రం జరగనున్న ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరుకాలేనని అధికారులకు సమాచారం.
..ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స నేపథ్యంలో, ఫిజియోథెరపీపై వైద్య నిపుణుల సూచనలు తీసుకోనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

మహానాడు,
అమరావతి:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో శనివారం సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో నిర్వహించనున్న ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి ఆయన హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని లోక్‌భవన్‌ అధికారులకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.

శనివారం ఉదయం కాకినాడలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించారు. అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు.

రాజమహేంద్రవరంలో వైద్యులు పవన్‌ కల్యాణ్‌ను పరీక్షించి వైద్య సలహాలు అందించారు. కొంత ఉపశమనం లభించిన అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం అవసరమైన ఫిజియోథెరపీపై వైద్య నిపుణుల నుంచి ఆయన సూచనలు తీసుకోనున్నారు.

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు మీడియాకు సమాచారం వెల్లడించింది.